హైదరాబాద్ సేఫ్ సిటీ : అంజనీకుమార్

ABN , First Publish Date - 2021-03-27T21:39:57+05:30 IST

ప్రజా భద్రత కోసం గత ఏడేళ్లు‌గా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని సీపీ అంజనీకుమార్ తెలిపారు.

హైదరాబాద్ సేఫ్ సిటీ : అంజనీకుమార్

హైదరాబాద్: ప్రజా భద్రత కోసం గత ఏడేళ్లు‌గా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. శనివారం సీపీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత సేఫ్ సిటీల్లో హైదరాబాద్ ఒకటని అమెరికాకు చెందిన ఓ సర్వే కంపెనీ కూడా చెప్పిందని గుర్తుచేశారు. దేశంలో అత్యంత సేఫ్ సిటీలో నంబర్ టూలో ఉందని సర్వేలో తేలిందని స్పష్టం చేశారు. నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమరాల పాత్ర ఎంతో ఉందన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి హైదరాబాద్ సీపీగా ఉన్నప్పటి నుంచి సీసీ కెమెరాలను ప్రారంభించారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మూడు కమీషనరేట్ల పరిధిలో ఆరు లక్షల సీసీ కెమెరాలున్నాయిన్నారు. ఒక‌ సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని చెప్పారు.


రాత్రి సమయంలో కూడా రికార్డు అయ్యేలా టెక్నాలజీని వాడుతున్నామన్నారు. ఎన్నో నేరాలను ఛేదించడంలో సీసీ కెమెరాలు కీలక‌పాత్ర పోషించాయని తెలిపారు. కోర్టుల్లో ఎవిడెన్స్ గానూ ఉపయోగడుతున్నాయన్నారు. సీసీ కెమెరాలు ఉండటంతో 2018 నుంచి బహిరంగ ప్రదేశాల్లో నేరాల శాతం తగ్గుతూ వస్తోందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర  హోంమంత్రి మహమూద్ అలీ,  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సహకారం అందించారు.. వారికి సీపీ అంజనీకుమార్ ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2021-03-27T21:39:57+05:30 IST