యువతపైనే దేశ భవిష్యత్తు : సీపీ

ABN , First Publish Date - 2021-10-13T05:08:20+05:30 IST

యువతపైనే దేశ భవిష్యత్తు : సీపీ

యువతపైనే  దేశ భవిష్యత్తు : సీపీ
పోటీల ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న సీపీ జోషి

మామునూరు, అక్టోబరు 12 : యువతపైనే దేశ భవిష్య త్తు ఆధారపడి ఉందని వరంగల్‌ నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌జోషి అన్నారు. 17వ డివిజన్‌ బొల్లికుంట వాగే ్దవి ఇంజనీరింగ్‌ కళాశాలలో మామునూరు సబ్‌ డివిజన్‌ పోలీసుల ఆధ్వర్యంలో రెండురోజుల మెగా వాలీబాల్‌ పోటీ లను మంగళవారం సీపీ ప్రారంభించారు. డివిజనల్‌ పరిధి లోని పోలీసుస్టేషన్‌ల వారీగా ఎంపిక చేసిన 50వాలీబాల్‌ జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. సీపీ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిసకాకుండా దేశ భవిష్యత్తుపై ఆలోచ నలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వరంగల్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మీ, టాస్క్‌ఫోర్స్‌ ఏఎస్‌పీ వైభవ్‌ గైక్వాడ్‌, ఏఆర్‌ అదనపు డీసీపీ భీంరావు, మామునూరు ఏసీపీ నరేష్‌కుమార్‌, వర్ధన్నపేట ఏసీపీ నాగయ్య, పర్వత గిరి సీఐ విశ్వేశ్వర్‌, గీసుగొండ సీఐ వెంకటేశ్వర్లు, మాము నూరు సీఐ రమేష్‌కుమార్‌, ఐనవోలు, పర్వతగిరి సంగెం ఎస్‌ఐలు భరత్‌, భాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-13T05:08:20+05:30 IST