నేరాల నియంత్రణ..చర్యలపై సీపీ సమీక్ష

ABN , First Publish Date - 2020-09-23T10:12:56+05:30 IST

నగరంలోని పోలీ్‌సస్టేషన్ల పరిధిలో రౌడీల పరిస్థితి, రౌడీషీట్ల గురించి హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ అధికారులతో

నేరాల నియంత్రణ..చర్యలపై సీపీ సమీక్ష

అన్ని జోన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): నగరంలోని పోలీ్‌సస్టేషన్ల పరిధిలో రౌడీల పరిస్థితి, రౌడీషీట్ల గురించి హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. నగరంలోని అన్ని జోన్ల అధికారులు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. రౌడీలతోపాటు, నేరాలు, నియంత్రణ చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణ, పీడీయాక్టుల నమోదు తీరు, పెండింగ్‌లో ఉన్న కేసులు, దర్యాప్తు... కోర్టు అంశాల గురించి అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు సీపీ షికాగోయెల్‌, జాయింట్‌ సీపీలు ఏఆర్‌ శ్రీనివాస్‌, విశ్వప్రసాద్‌, ఎం.రమేశ్‌, డీసీపీలు కలమేశ్వర్‌, గజరావు భూపాల్‌లు కూడా పాల్గొన్నారు.  

Updated Date - 2020-09-23T10:12:56+05:30 IST