మహిళ సిబ్బందికి కేసుల దర్యాప్తులో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం: సీపీ సజ్జనార్

ABN , First Publish Date - 2021-01-27T17:16:33+05:30 IST

సైబరాబాద్: సైబరాబాద్‌లో 750 మంది ఉమెన్ పోలీసులు ఉన్నారని సీపీ సజ్జనార్ తెలిపారు.

మహిళ సిబ్బందికి కేసుల దర్యాప్తులో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం: సీపీ సజ్జనార్

సైబరాబాద్: సైబరాబాద్‌లో 750 మంది ఉమెన్ పోలీసులు ఉన్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. ఒక యానువాల్ మీట్ లాగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.‘షీ పాహి’ కార్యక్రమం ఏర్పాటు ద్వారా మహిళ సిబ్బందిలో స్ఫూర్తి నింపుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వం 33 శాతం మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిందన్నారు. సీనియర్ ఆఫీసర్స్‌లో 50 శాతం మహిళలు ఉన్నారన్నారు. మహిళ సిబ్బందికి కేసుల దర్యాప్తులో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని సీపీ తెలిపారు. సైబరాబాద్‌లో మహిళా సిబ్బంది అద్భుతంగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. ఉమెన్ సిబ్బంది ప్రతి ఒక్కరికీ రానున్న రోజుల్లో డ్రైవింగ్‌పై శిక్షణ ఇస్తామన్నారు. ట్రాఫిక్‌లో సైతం మహిళ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు.

Updated Date - 2021-01-27T17:16:33+05:30 IST