స్టెల్లా కళాశాలలో సీపీబీఎఫ్‌ఐ సర్టిఫికెట్‌ కార్యక్రమం

ABN , First Publish Date - 2022-01-18T05:46:24+05:30 IST

మారిస్‌ స్టెల్లా కళాశాలలో సోమవారం సీపీబీఎఫ్‌ఐ సర్టిఫికెట్‌ కార్యక్రమం నిర్వహించారు. బజాజ్‌ ఫిన్‌ సర్వే సీనియర్‌ మేనేజర్‌ రాజా డిక్రూజ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

స్టెల్లా కళాశాలలో సీపీబీఎఫ్‌ఐ  సర్టిఫికెట్‌ కార్యక్రమం

స్టెల్లా కళాశాలలో సీపీబీఎఫ్‌ఐ  సర్టిఫికెట్‌ కార్యక్రమం

రామలింగేశ్వరనగర్‌, జనవరి 17 : మారిస్‌ స్టెల్లా కళాశాలలో సోమవారం సీపీబీఎఫ్‌ఐ సర్టిఫికెట్‌ కార్యక్రమం నిర్వహించారు. బజాజ్‌ ఫిన్‌ సర్వే సీనియర్‌ మేనేజర్‌ రాజా డిక్రూజ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీఏ, బీకామ్‌, బీఎస్సీ విద్యార్థినులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, జాబ్‌ రిక్వైర్‌మెంట్‌, ఇండస్ర్టీ ఎక్స్‌పీరియన్స్‌ ఈ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా త ర్ఫీదు ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సిస్టర్‌ జసింతా క్వాడ్రస్‌ తెలిపారు. బజాజ్‌ ఫిన్‌ సర్వే కంపెనీ కళాశాలతో ఎంవోయూ కుదుర్చుకుందని, గత మూడేళ్లుగా డిగ్రీ మూడో సంవత్సరం విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 45 రోజుల పాటు  శిక్షణా కార్యక్రమం జరుగుతుందని కళాశాల కో-ఆర్డినేటర్‌ టి. శోభ తెలిపారు. డాక్టర్‌ లావణ్య, కనకదుర్గ, బజాజ్‌ ఫిన్‌సర్వే సభ్యులు రాజశేఖర్‌రెడ్డి, పవన్‌, డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థినులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-18T05:46:24+05:30 IST