కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి: Chada

ABN , First Publish Date - 2021-09-16T19:47:41+05:30 IST

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి: Chada

పెద్దపల్లి: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనదినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. మోసపూరిత వాగ్ధానాలతో కేసీఆర్ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. ఎంఐఎం పార్టీకి భయపడి సీఎం కేసీఆర్ విమోచన దినాన్ని జరపడం లేదన్నారు. తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. 

Updated Date - 2021-09-16T19:47:41+05:30 IST