Abn logo
Aug 2 2020 @ 11:34AM

బీజేపీ, వైసీపీ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయి: ధోనేపూడి శంకర్

విజయవాడ: మూడు రాజధానుల ప్రక్రియలను అందరూ వ్యతిరేకిస్తున్నారని సీపీఐ నేత ధోనేపూడి శంకర్ తెలిపారు. ఒకప్పుడు సాక్షాత్తు జగన్మోహనరెడ్డే అసెంబ్లీలో అమరావతిలో 30వేల ఎకరాలలో రాజధాని నిర్మించాలని తెలిపారని గుర్తుచేశారు. బీజేపీ, వైసీపీ రెండూ కూడా అమరావతి విషయంలో రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు రాజధానులు వద్దు.. ఒక్క రాజధానే ముద్దు అంటూ ఆదివారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీపీఐ కార్యాలయంలో ఆందోళన కార్యక్రమంలో ధోనేపూడి శంకర్, ఇతర సీపీఐ నేతలు పాల్గొన్నారు.