ఏపీలో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఏం చేస్తోంది?: సీపీఐ నేత మూర్తి

ABN , First Publish Date - 2020-06-06T14:34:55+05:30 IST

ఏపీలో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఏం చేస్తోంది?: సీపీఐ నేత మూర్తి

ఏపీలో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఏం చేస్తోంది?: సీపీఐ నేత మూర్తి

అమరావతి: వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే రౌడీయిజం పెరిగిందని సీపీఐ నేత మూర్తి తెలిపారు. ఏబీఎన్‌ డిబేట్‌లో మాట్లాడుతూ ప్రశాంత విశాఖకు సెటిల్‌మెంట్ల వ్యవహారం తీసుకొచ్చారని... బయటి నుంచి వచ్చినవాళ్లే సెటిల్‌మెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. దాడులు, దౌర్జాన్యాలకు అధికార పార్టీ వంతపాడుతోందని ఆయన ఆరోపించారు. గ్యాంగ్‌వార్‌లో పోలీసుల వైఫల్యం కనబడుతోందన్నారు. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని వేధింపులకు గురిచేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ప్రశాంత వాతావరణం ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని సీపీఐ నేత మూర్తి పేర్కొన్నారు.

Updated Date - 2020-06-06T14:34:55+05:30 IST