Abn logo
Aug 23 2021 @ 12:42PM

కిషన్ రెడ్డిపై నారాయణ సెటైర్

హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సీపీఐ జాతయ కార్యదర్శి నారాయణ సెటైర్లు విసిరారు. బీజేపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తూ జనాలను మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. జన ఆశీర్వాద యాత్ర పేరుతో కేంద్రమంత్రి పచ్చి అబద్దాలు చెప్తున్నారన్నారు. పార్లమెంటులో ప్రధాని.. బయట కేంద్రమంత్రులు అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాలిబన్లు ఎంత ప్రమాదమో.. పెగాసెస్ అంతే ప్రమాదమన్నారు. నిఘా సంస్థలతో చేసుకున్న ఒప్పందాన్ని బయట పెట్టడానికి ప్రధాని మోదీ భయపడుతున్నారని తెలిపారు. మూడు రైతు చట్టాలను అమలు చేస్తే ప్రైవేట్ వ్యక్తులు బాగుపడతారని నారాయణ పేర్కొన్నారు.

హైదరాబాద్మరిన్ని...