Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. సర్పంచులకు నిధులు, విధులు లేకుండా పంచాయతీల అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 14, 15 ఆర్థిక సంఘాల నిధులతో పాటు సాధారణ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం సరికాదన్నారు. సర్పంచులకు అధికారాలు లేకుండా చేయడమే తమరు చెబుతున్న అధికార వికేంద్రీకరణా? అని నిలదీశారు. పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని ఏపీలోని సర్పంచులు ఆందోళనకు సిద్ధమవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పంచాయితీల నిధులు రూ.3,450 కోట్లను తిరిగి ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement