Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు తగదు: Ramakrishna

అమరావతి: ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమాపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించి, జైలుకు పంపడం విచారకరమన్నారు. పాలనా వైఫల్యాల గురించి ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు, గృహ నిర్భంధాలు, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టటం తగదని అన్నారు. కొండపల్లిలో అక్రమ క్వారీయింగ్ తవ్వకాలు, ఆక్రమణలు గురించి ప్రశ్నించిన దేవినేని ఉమాపై వైసీపీ వర్గీయులు దాడి చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లు జగనన్న స్టేషన్లుగా మారాయన్నారు. ప్రజాతంత్ర వాదులంతా ప్రభుత్వ, పోలీసు చర్యలను ఖండించాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. 

Advertisement
Advertisement