Advertisement
Advertisement
Abn logo
Advertisement

హాజీరా కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి: Ramakrishna

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. కర్నూలు జిల్లా ఎర్రబాడు గ్రామంలో హజీరా అనే యువతి హత్య జరిగి ఏడాది కాలమైందని,  దోషులు ఎవరో పోలీసులకు తెలిసినప్పటికీ ఇప్పటివరకు పట్టుకోలేదని విమర్శించారు. హాజీరా కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. స్వాతంత్ర దినోత్సవం నాడు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య జరగడం బాధాకరమని తెలిపారు. రమ్య హంతకుడిని త్వరగా పట్టుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. రమ్య కుటుంబానికి కూడా రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరుతున్నామని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Advertisement
Advertisement