Advertisement
Advertisement
Abn logo
Advertisement

కిషన్ రెడ్డి చేసేది జన వంచన యాత్ర: రామకృష్ణ

అమరావతి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసేది జన వంచన యాత్ర అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఏపీకి అడుగడుగున అన్యాయం చేసిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, కడప స్టీల్ ఫ్యాక్టరీ, రాజధాని, పోలవరం నిర్మాణం, బడ్జెట్లో నిధుల కేటాయింపులలో కేంద్రం మోసం చేసిందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ఆదాని, అంబానీల ఆస్తులు పెంచటమే మోదీ పాలన అని అన్నారు.  పెట్రో ఉత్పత్తుల ధరలు, నిత్యవసర వస్తువుల ధరలు బీజేపీ పాలనలో అందుకోలేనంత పెరిగాయన్నారు. ఏపీ అప్పులు చేసిందని చెబుతున్న కేంద్రం ఏడేళ్లలో రూ.47 లక్షల కోట్ల నుండి రూ.119 లక్షల కోట్లకు అప్పులను పెంచడాన్ని ఏమనాలని ప్రశ్నించారు.  ఏపీ బీజేపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని రామకృష్ణ హితవుపలికారు. 

Advertisement
Advertisement