Abn logo
Sep 19 2020 @ 07:35AM

ఏపీలో బార్లు తెరవడం అవసరమా?: రామకృష్ణ

Kaakateeya

అమరావతి: కరోనా విజృంభణ నేపథ్యంలో ఏపీలో బార్లు తెరవడం అవసరమా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం కరోనాపై పోరాడుతున్న వైద్యులను గౌరవించకపోగా వారిపై వేధింపులకు, దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో 6,09,558 కరోనా కేసులు, 5244 మరణాలు సంభవించాయన్నారు. ఇప్పటికే వైన్ షాపులకు అనుమతి ఇవ్వడంతో కరోనా వ్యాప్తి పెరిగిపోయి దేశంలో ఏపీ 2వ స్థానానికి చేరిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజారోగ్యానికి తిలోదకాలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆదాయం పెంచుకునేందుకు మార్గాలను మాత్రమే అన్వేషిస్తోందని విమర్శించారు. అందులో భాగంగానే బార్లకు అనుమతిచ్చి 20 శాతం కోవిడ్ ఫీజు, 10 శాతం ఏఈఆర్టీ విధించిందన్నారు. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.1 చొప్పున సెస్సు విధించి, ప్రజలపై రు.600 కోట్లు భారం మోపిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.65 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపిందని రామకృష్ణ తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement