Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిరుద్యోగులను మరోసారి దగా చేసిన ఏపీ సర్కార్: రామకృష్ణ

అమరావతి: నిరుద్యోగులను ఏపీ సర్కార్ మరోసారి దగా చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శలు గుప్పించరు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులు, యువజన, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందన్నారు. ఏపీలో కొత్తగా 1,180 పోస్టుల భర్తీకై నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ, కొత్త ఉద్యోగాలను జాబ్‌ క్యాలెండర్‌లో చేర్చాలని ఆదేశాలిచ్చిందన్నారు. జగన్ జాబ్‌క్యాలెండర్‌ను జాబ్ లెస్ క్యాలెండర్‌గా పరిగణిస్తూ ఏపీ వ్యాప్తంగా నిరుద్యోగ సంఘాలు గత 40 రోజులకుపైగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.35 లక్షల ఉద్యోగాల భర్తీతో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

Advertisement
Advertisement