Advertisement
Advertisement
Abn logo
Advertisement

అనంతపురంలో విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన రామకృష్ణ

అమరావతి: అనంతపురంలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ను  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుత నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ అమానుషమన్నారు. విలీనం పేరుతో ఎయిడెడ్ విద్యా రంగాన్ని ప్రైవేటుపరం చేస్తే ఫీజులు అధికమవడం ఖాయమని తెలిపారు. దశలవారీగా విద్యా రంగాన్ని ప్రైవేటుపరం చేసే రాష్ట్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని విద్యార్థి లోకానికి  పిలుపునిచ్చారు. పోలీస్ స్టేషన్‌కు తరలించిన విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement