పోలవరంపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-10-24T14:32:52+05:30 IST

పోలవరం జాతీయ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులో రూ.20 వేల కోట్ల మేర కేంద్రం కోత పెడుతోందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ తెలిపారు.

పోలవరంపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: రామకృష్ణ

అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులో రూ.20 వేల కోట్ల మేర కేంద్రం కోత పెడుతోందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. 2013-14 అంచనాల ప్రకారం రూ.20,398.61 కోట్లని, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రీయంబర్స్ రూ.7 వేల కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం చెబుతోందని విమర్శించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుపై కేంద్ర వైఖరి పూర్తిగా నమ్మకద్రోహమని వ్యాఖ్యానించారు. జగన్ స్వయంగా ప్రధానమంత్రిని, కేంద్ర ఆర్థిక మంత్రిని కలసి పోలవరం నిధుల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. పోలవరం గురించి చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నామని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-24T14:32:52+05:30 IST