రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏదీ?

ABN , First Publish Date - 2021-10-24T03:19:00+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక హోదా తీసుకువస్తామన్న హామీ ఏమయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏదీ?
సమావేశంలో మాట్లాడుత్ను రామకృష్ణ

విభజన హామీలు ఏమయ్యాయి

కోటీశ్వరులకు కొమ్మ కాస్తున్న ప్రధాని మోదీ

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

నెల్లూరు(వైద్యం), అక్టోబరు 23 : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక హోదా తీసుకువస్తామన్న హామీ ఏమయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. సీపీఐ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన వర్క్‌షాపులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ప్రత్యేక హోదా లేదన్నారు. విభజన హామీలు నేటికి అమలు కాలేదన్నారు. శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. దళిత రైతులపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారంటే పోలీసు వ్యవస్థ ఎంత అంధకారంలో ఉందో తెలుస్తుందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నా కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే మాట్లాడుతూ అందరినీ డమ్మీలు చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నేత పట్టాభి అనుచిత వాఖ్యలు చేశారని అతని ఇంటి మీద దాడులు చేసిన వారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఒక శాతం ఉన్న కోటీశ్వరులకు 70 శాతం దేశ సంపదను అప్పగిస్తుందని విమర్శించారు. మిగిలిన 90 శాతం ప్రజలకు 30 శాతం నిధులను మాత్రమే ఖర్చు చేస్తుందన్నారు. రక్షణశాఖ, రైల్వే, ఇస్రో, బీఎస్‌ఎన్‌ఎల్‌ లాంటి సంస్థలను ప్రైవేట్‌ పరం చేయడం దుర్మార్గమన్నారు. 32 మంది బలిదానం చేసిన విశాఖ ఉక్కును అంబాని, ఆదాని పరం చేయాలని చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జాతీయ నాయకుడు రావుల వెంకయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌, సహాయ కార్యదర్శి దామా అంకయ్య, కార్యవర్గ సభ్యులు నాగేంద్ర సాయి, రాయరాజు, సుధాకర్‌రెడ్డి, డేగా సత్యం, రమణయ్య, బాలకృష్ణ, ఆనంద్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T03:19:00+05:30 IST