Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతులపై బీజేపీ నేతల దాడి హేయమైన చర్య: Ramakrishna

విజయవాడ: దేశంలో మోడీ సర్కార్ నియంతపాలన కొనసాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. యూపీలో రైతులపై జరిగిన దాడిని ఖండిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ శాంతియుతంగా రైతులు తమ సమస్యను చెప్పుకునేందుకు ర్యాలీ చేపడితే వారిపై బీజేపీ నేతలు దాడికి పాల్పడడం హేయమైన చర్య అని అన్నారు. దాడిలో చనిపోయిన ఒక్కో రైతుకు కోటిరూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దాడికి కారకులైన బీజేపీ నేతలపై కేసు నమోదు చేయాలని...కఠినంగా శిక్షించాలన్నారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను వెంటనే భర్తరఫ్ చేయాలని... లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేస్తామని రామకృష్ణ హెచ్చరించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement