Advertisement
Advertisement
Abn logo
Advertisement

శ్మశానంలో పరిపాలన రాజధాని పెడతారా?: Ramakrishna

విశాఖపట్నం: విశాఖలో అన్ని ఆస్తులు అమ్మేస్తున్నారని...శ్మశానంలో పరిపాలన రాజధాని పెడతారా? అని సీపీఐ రామకృష్ణ ప్రశ్నించారు. పరిపాలన రాజధాని పేరుతో విశాఖను దగా చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్ధిక మంత్రిని...అప్పుల మంత్రిగా మార్చేశారన్నారు. టీడీపీ, వైసీపీ అప్పులపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని ఎంపీలు ఒక్కసారి అయిన పీఎం దగ్గరకు వెళ్లారా? అని నిలదీశారు. రాష్ట్రంలో దమ్మున్న ఎంపీ ఒక్కరూ లేరన్నారు. రైతులను చంపడం దారుణమని, రైతులతో చర్చించడానికి ప్రధాని అర గంట సమయం లేదా? అని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement