ఆ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-05-05T15:44:28+05:30 IST

ఆక్సిజన్ అందక జరిగే మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఆ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: రామకృష్ణ

అమరావతి: ఆక్సిజన్ అందక జరిగే మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. అనంతపురం, కర్నూలు, హిందూపురం, విజయనగరంలలో ఆక్సిజన్ కొరత కారణంగా ఇప్పటికే 35 మంది చనిపోయారన్నారు. అనంతపురంలో ఆక్సిజన్ లేక మరో నలుగురు చనిపోవడం బాధాకరమన్నారు. ఏపీలో ప్రస్తుతానికి 480 టన్నుల ఆక్సిజన్ మాత్రమే ఉందని తెలిపారు. కరోనా కేసులు ఇలాగే పెరుగుతుంటే ఈనెల 15 తర్వాత 1000 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుందని అన్నారు. కరోనా ఉధృతికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-05-05T15:44:28+05:30 IST