దేశంలో, రాష్ట్రంలో నియంత పాలన

ABN , First Publish Date - 2020-12-01T05:04:59+05:30 IST

దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌లు నియంత పాలన కొనసాగిస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు విమర్శించారు.

దేశంలో, రాష్ట్రంలో నియంత పాలన
సమావేశంలో మాట్లాడుతున్న కూనంనేని సాంబశివరావు

ప్రైవేటీకరణకు కొమ్ముకాస్తున్న మతతత్వ శక్తులు

సీపీఐ నగర జనరల్‌ బాడీ సమావేశంలో కూనంనేని, పువ్వాడ

ఖమ్మం మయూరిసెంటర్‌, నవంబరు 30: దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌లు నియంత పాలన కొనసాగిస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు విమర్శించారు. సోమవారం నగరంలోని బైపాస్‌రోడ్‌లోని ఓ ఫంక్షన్‌హల్‌లో నిర్వహించిన పార్టీ నగర జనరల్‌బాడీ సమావేశంలో వారు మాట్లాడారు. దశాబ్దాలుగా పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు, చట్టాలను తమ గుప్పిట్లో ఉంచుకుని ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారన్నారు. మోదీ ప్రభుత్వం ప్రైవేట్‌ రంగ సంస్థలన్నింటిని ప్రైవేటికరిస్తూ దేశాన్ని దివాళా తీయిస్తోందని ఆరోపించారు. ఇటివల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో మతాన్ని రెచ్చగొట్టి లబ్ధిపొందిన విధానాన్ని ప్రజలంతా గమనించాలన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తున్నామని చెబుతూ, ఎన్నికల్లో ప్రజలను డబ్బుతో ప్రలోభపెట్టి ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తున్నారన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సిన కేంద్రం ఇటీవల చేసిన మూడు వ్యవసాయ బిల్లుల కారణంగా రైతులు సాగుకు దూరమయ్చే ప్రమాదం ఉందన్నారు.  ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాగం హేమంతరావు, పార్టీ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, నాయకులు మహమ్మద్‌ మౌలానా, నర్సింహరావు, సలాం, జానిమియా, వెంకటేశ్వరరావు, కళావతి, రామకృష్ణ, గాంధీ, శశిధర్‌, రామకృష్ణ, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T05:04:59+05:30 IST