ఆర్వీనగర్‌-పాలగెడ్డ రోడ్డు పనులను ప్రారంభించాలి

ABN , First Publish Date - 2020-12-05T04:13:25+05:30 IST

ఆర్వీనగర్‌-పాలగెడ్డ రహదారి విస్తరణ పనులను ప్రారంభించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ డిమాండ్‌ చేశారు.

ఆర్వీనగర్‌-పాలగెడ్డ రోడ్డు పనులను ప్రారంభించాలి
సమావేశంలో మాట్లాడుతున్న వెంకటరమణ


సీలేరు, డిసెంబరు 4: ఆర్వీనగర్‌-పాలగెడ్డ రహదారి విస్తరణ పనులను ప్రారంభించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ధారకొండలో నిర్వహించిన సీపీఐ మండల సమితి సమావేశలో ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ఆర్వీనగర్‌ నుంచి తూర్పుగోదావరి జిల్లా పాలగెడ్డ వరకు రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ నేతలు మొట్టడం రాజబాబు, సుంకర విష్ణుమూర్తి, కంకిపాటి సత్తిబాబు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-05T04:13:25+05:30 IST