కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచుతున్న పెట్రోల్ ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-01-20T21:26:30+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఐ (ఎం-ఎల్) రెడ్ స్టార్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ సంతోష్ డిమాండ్ చేశారు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచుతున్న పెట్రోల్ ధరలు తగ్గించాలి

హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం  పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఐ (ఎం-ఎల్) రెడ్ స్టార్  రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ సంతోష్ డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం పలుమార్లు పెట్రోల్ డీజిల్ ధరలను  అడ్డూఅదుపు లేకుండా పెంచుతూ   ప్రజలపై మోయలేని భారం  మోపుతుందన్నారు  ఒక లీటర్ పెట్రోలు అసలు ధర రూ  28.50 కాగా వివిధ పన్నుల పేరుతో  రూ  88.63 కు లీటర్ డీజిల్ అసలు ధర రూ 29.53కాగా రూ 81.99కు విక్రయిస్తుదన్నారు.


2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు లీటర్ పెట్రోల్ పై  రూ  9.48ఉన్న కేంద్ర పన్ను నేడు  రూ  32.98కి   డీజిల్ పై రూ  3.56ఉన్న కేంద్ర పన్ను ఇప్పుడు రూ  31.83కు పెంచి సామాన్య ప్రజలపై  పెను భారం వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు  ఆయిల్ ధరలు పెరగడం వల్ల రవాణారంగంతోపాటు నిర్మాణ రంగానికి కష్టాలు మొదలయ్యాయి అన్నారు.


లాక్  డౌన్ కాలంలో అంతర్జాతీయ ఆయిల్ రేట్లు జీరో పడిపోయిన కేంద్రం ఆయిల్ సంస్థలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకుండా కోట్ల రూపాయలు దండుకున్నారన్నారు.కేంద్ర ప్రభుత్వానికి లాక్  డౌన్  కాలంలో పది లక్షల కోట్ల రూపాయలు ఖజానాకు జమ చేసుకుందన్నారు  వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని లేనియేడల పెద్దయెత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2021-01-20T21:26:30+05:30 IST