Advertisement
Advertisement
Abn logo
Advertisement

పడవలపై ఇసుక తరలింపునకు అనుమతించాలి

ముప్పాళ్ల నాగేశ్వరరావు

గుంటూరు(తూర్పు), డిసెంబరు3: పడవలపై ఇసుక ఒడ్డుకు చేర్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. కొత్తపేట మల్లయ్యలింగం భవన్‌లో శుక్రవారం అమరావతి ఇసుక పడవల యజమానుల సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు జిల్లాలో పడవలపై ఇసుకను ఒడ్డుకు చేర్చుకుని దాదాపు 1000మంది జీవనాపాధి పొందుతున్నారని పేర్కోన్నారు. అనుమతులు నిలిపివేయడంతో జీవనాఽధారం కోల్పోయి కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఉపాధిని దృష్టిలోపెట్టుకుని పడవల ద్వారా ఇసుక ఎగుమతి, దిగుమతులను చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో వి.రాధాకృష్ణమూర్తి, జంగాల అజయ్‌కుమార్‌, వెంకటరెడ్డి, కె.నాగేశ్వరావు, సదాశివరావు, మల్లికార్జునరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 

 

Advertisement
Advertisement