Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 22 2021 @ 14:12PM

రేవంత్‌ ఇంటిపై టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడిని ఖండించిన నారాయణ

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటిపై టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడిని సీపీఐ నారాయణ ఖండించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు డెకాయిట్లు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని ధ్వజమెత్తారు. ఇంకోసారి దాడులకు తెగబడితే సంగతి చూస్తామని హెచ్చరించారు. దమ్ముంటే డైరెక్ట్‌గా రావాలని.. అప్పుడు చూసుకుందామని సవాల్ విసిరారు. ఇళ్ల మీద దాడులు చేయడం నీచ సంస్కృతికి నిదర్శనమని తప్పుబట్టారు. రేవంత్‌రెడ్డి ఇంటి మీద దాడిని అఖిలపక్షం తీవ్రంగా ఖండిస్తోందని నారాయణ ప్రకటించారు.


మంత్రి కేటీఆర్‌, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మధ్య వివాదం మంగళవారం కార్యకర్తల ఘర్షణకు దారితీసింది. కేటీఆర్‌పై రేవంత్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్‌ఎస్వీ నాయకులు ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు వీరిని అడ్డగించి ఎదురుదాడికి దిగడంతో ఘర్షణ చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసం టీఆర్‌ఎస్ నాయకులు వద్దకు చేరుకున్నారు. రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇంటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. రేవంత్‌ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు యత్నించగా.. కాంగ్రెస్‌ కార్యకర్తలు కర్రలతో వెంటపడ్డారు. దీంతో టీఆర్‌ఎస్ సభ్యులు రాళ్లతో ఎదురుదాడి చేశారు. పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినా వినకపోవడంతో ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement