Advertisement
Advertisement
Abn logo
Advertisement

దశ తిరిగిందనుకుంటే దురదృష్టంగా మారిపోయింది: నారాయణ

తిరుపతి: ఏపీకి దశ తిరిగిందనుకుంటే దురదృష్టంగా మారిపోయిందని సీపీఐ నారాయణ అన్నారు. రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చే వరకు వైసీపీ నిద్రపోదన్నారు. చట్టానికి విరుద్ధంగా వెళ్తున్నామని తెలిసే బిల్లును వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు. రాజధాని అంశాన్ని మళ్లీ కాలయాపన చేస్తారని చెప్పారు. వైసీపీ తప్పులు చేసి దానికి అంగీకరించడానికి సిద్ధంగా ఉండదని, వైసీపీ ప్రభుత్వ వైఖరి వల్లే నష్టపోతున్నామని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement