Abn logo
Sep 26 2021 @ 02:15AM

పోర్టుల ప్రైవేటీకరణతో.. దేశ భద్రతకు ముప్పు

మోదీ కంటే మన్మోహన్‌ పాలనే బెటర్‌: సీపీఐ నారాయణ


ఒంగోలు కార్పొరేషన్‌, సెప్టెంబరు 25: పోర్టులను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టడం ద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని సీపీఐ జాతీ య కార్యదర్శి నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ 27న భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోదీ కంటే మన్మోహన్‌సింగ్‌ పాలనే కొంతమేర బెటర్‌గా ఉందన్నారు. ముఖ్యమంత్రుల తప్పులను ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఆంధ్రలో చంద్రబాబు ఇంటిపై, తెలంగాణలో రేవంత్‌రెడ్డి ఇంటిపై దాడులు చేయడం హీన సంస్కృతి అన్నారు.