Advertisement
Advertisement
Abn logo
Advertisement

తిరుపతి ఉప ఎన్నికలతో రాజకీయాలలో పెను మార్పులు

విజయవాడ: తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు వస్తాయని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె.రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రానికి చెందిన ఎంపీలందరూ రాజీనామా చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజకీయాలను మార్చే దిశగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. 

తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌తో పాటు 15 అంశాలపై బీజేపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు హక్కు అడిగే నైతిక అర్హత లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని  సోషల్ మీడియాలో బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. 

Advertisement
Advertisement