Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమరావతి విషయంలో బీజేపీ డ్రామాలు: రామకృష్ణ

అమరావతి: అమరావతి ఉద్యమం చారిత్రాత్మకమని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వైసీపీ 13 జిల్లాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అమరావతిపై ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నామన్నారు. అమరావతి విషయంలో బీజేపీ డ్రామాలాడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోలార్ విద్యుత్ కొనుగోలు విషయంలో వేలకోట్లలో గోల్ మాల్ జరుగుతోందన్న అనుమానం కలుగుతోందన్నారు. 22 రాష్ట్రాలు సోలార్ విద్యుత్ కొనుగోలు తిరస్కరిస్తే ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక్కరోజులోనే ఆమోదం తెలిపిందన్నారు. అదానీతో జగన్ లాలూచీకి నిదర్శనమన్నారు. 

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement