జగన్‌తో మంత్రులు మాట్లాడే పరిస్థితి ఉందా?: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-07-02T16:20:15+05:30 IST

రాష్ట్రంలో పెత్తందారీతనం నడుస్తోందని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు. ‘‘సామాజిక న్యాయం అంటూ పదే పదే చెప్పే జగన్... వైసీపీలో సామాజిక న్యాయం

జగన్‌తో మంత్రులు మాట్లాడే పరిస్థితి ఉందా?: రామకృష్ణ

గుంటూరు: రాష్ట్రంలో పెత్తందారీతనం నడుస్తోందని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు. ‘‘సామాజిక న్యాయం అంటూ పదే పదే చెప్పే జగన్... వైసీపీలో సామాజిక న్యాయం లేదని తెలియదా?, మూడు ప్రాంతాల్లో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు అప్పగించారు. మీ పార్టీలో వేరే కులాల వారు లేరా?, వారు పదవులకు పనికి రారా?, రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో అంతా మీ బంధువులే ఉన్నారు. 70 మందిలో 46 మంది మీ కులం వారే ఉన్నారు. సెర్చ్ కమిటీల్లో 12 మందికి 9 మంది రెడ్లకే ఇచ్చారు. ముగ్గురు, నలుగురే మొత్తం నడిపిస్తున్నారు. ఎస్సీ నాయకులు పదవులకు పనికిరారా?, ధర్మాన, పిల్లి సుభాష్ చంద్రబోస్, అంబటి రాంబాబు, పార్థసారథి వంటి వారు పదవులకు పనికిరారా?, ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ఒక్కరైనా ముఖ్యమంత్రితో మాట్లాడే పరిస్థితి ఉందా?, కమ్యూనిస్టులకు కులం అంటగట్టే ముందు మీ పార్టీలో పదవులు ఎవరికీ ఇచ్చారో చూడండి. వీటిన్నింటికీ సీఎం జగన్ సమాధానం చెప్పాలి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల రెండు అవాస్తవాలు మాట్లాడారు. విద్యుత్ కొనుగోళ్లు విషయంలో కేంద్ర మంత్రి ఓ మాట.. రాష్ట్ర సలహాదారు ఓ మాట చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తింటే.. కేంద్ర మంత్రి మాటలకు మీ పరువు పోదా?, ఆమె మాటలు అబద్ధం అయితే ఎందుకు కేసు పెట్టడం లేదు.’’ అని రామకృష్ణ ప్రశ్నించారు.

Updated Date - 2020-07-02T16:20:15+05:30 IST