Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రవీణ్ ఆదిత్యపై చర్యలు తీసుకోవాలి: రామకృష్ణ

అమరావతి: రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య వైఖరిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. రంపచోడవరం ఐటీడీఏ  ప్రాజెక్ట్ అధికారి ప్రవీణ్ ఆదిత్య అనాగరిక సమాజంలో ఉన్నట్లు మెసలడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రవీణ్ ఆదిత్య వద్దకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వంపల రాజేశ్వరితోసహా పలువురిని కింద కూర్చోబెట్టారని మండిపడ్డారు.ఐటీడీఏ పీఓ అహంకారానికి, అహంభావానికి ఇది నిదర్శనమన్నారు. తక్షణమే ప్రవీణ్ ఆదిత్యను రంపచోడవరం నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. 

Advertisement
Advertisement