రెండు వారాల్లో టిట్కో ఇళ్లు కేటాయించాలి: సిపిఐ రామకృష్ణ

ABN , First Publish Date - 2021-07-23T20:32:37+05:30 IST

లబ్ధిదారులకు రెండు వారాల్లో టిడ్కో ఇల్లు కేటాయించాలని.. లేదంటే ఆగస్టు 15న గృహప్రవేశం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు.

రెండు వారాల్లో టిట్కో ఇళ్లు కేటాయించాలి: సిపిఐ రామకృష్ణ

కృష్ణా : లబ్ధిదారులకు రెండు వారాల్లో టిడ్కో ఇల్లు కేటాయించాలని.. లేదంటే ఆగస్టు 15న గృహప్రవేశం చేస్తామని సీపీఐ  రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. కృష్ణా జిల్లా నందిగామ అనాసాగరంలో నీట మునిగిన జగనన్న ఇళ్ల స్థలాలను టిడిపి, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల స్థలాల్లో రూ. 2వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని పథకాలకూ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరే పెట్టుకున్నారని విమర్శించారు. స్వాతంత్ర్య సమరయోధుల పేరు పెట్టవచ్చు కదా అని ప్రశ్నించారు. మరోవైపు నందిగామ అనాసాగరంలో ఎకరాకు రూ.11లక్షల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఇళ్ల స్థలాల్లోకి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో పంట పొల్లాలో నుంచి వెళ్లారు.

Updated Date - 2021-07-23T20:32:37+05:30 IST