ఉక్కు ప్రైవేటీకరణను ఐక్యంగా అడ్డుకోవాలి: సీపీఎం

ABN , First Publish Date - 2021-03-08T10:07:06+05:30 IST

ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు.

ఉక్కు ప్రైవేటీకరణను ఐక్యంగా అడ్డుకోవాలి: సీపీఎం

కూర్మన్నపాలెం, మార్చి 7: ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో కొనసాగుతున్న రిలే నిరాహా ర దీక్షల శిబిరం ఆదివారం 24వ రోజుకు చేరుకుంది. స్టీల్‌ ప్లాంట్‌ సీఎస్సార్‌, పీపీఎం మార్కెటింగ్‌, పీడబ్ల్యుడీ, మాజీ సైనికులు దీక్షలో పాల్గొన్నారు. వీరికి కండువాలు వేసిన అనంతరం మధు మాట్లాడుతూ, ఉక్కు కర్మాగారం పరిరక్షణకు ఎంతటి త్యాగాలకైనా వెనుకాడేది లేదన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ సిహెచ్‌.నరసింగరావు మాట్లాడుతూ, స్టీల్‌ ప్లాంట్‌ ప్రజల సంపద అని, దీనిని అమ్మే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.

Updated Date - 2021-03-08T10:07:06+05:30 IST