గల్ఫ్‌ బాధితులను ఆదుకోవాలంటూ సీపీఎం ధర్నా

ABN , First Publish Date - 2020-06-01T09:11:21+05:30 IST

గల్ఫ్‌ బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఎం, సీఐటీయూల ఆధ్వర్యంలో ఆదివారం గాంధీ వి గ్రహం వద్ద ధర్నా

గల్ఫ్‌ బాధితులను ఆదుకోవాలంటూ సీపీఎం ధర్నా

రైల్వేకోడూరు రూరల్‌, మే, 31: గల్ఫ్‌ బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఎం, సీఐటీయూల ఆధ్వర్యంలో ఆదివారం గాంధీ వి గ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి, సీపీఎం నాయకుడు సీహెచ్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కడప జిల్లాలో ఎక్కువ శాతం గల్ఫ్‌ దేశాలైన కువైత్‌, సౌదీ, కత్తర్‌, బెహరిన్‌, దుబాయ్‌ తదితర దేశాలకు జీవనోపాధి కోసం ప్రజలు వెళ్లి ఉన్నారని తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో లా క్‌డౌన్‌ ప్రకటించారని, దీంతో జిల్లా ప్రజలు ప్రజ లు ఆయా దేశాల్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.


అకామా పూర్తి అయిన వారు ఉన్న వారు, ఇళ్లలో పనిచేసే వారు తదితరులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని వారిని స్వదేశాలకు రప్పించే ప్రయత్నం చేయాలన్నారు. సీపీఎం  నాయకులు లిం గాల యానాదయ్య, కర్రతోటి హరినారాయణ, సీఐటీయూ నాయకులు పుల్లగంటి శ్రీనివాసులు, అవాజ్‌ మండల కన్వీనర్‌ పి.మౌలాలి, ఎస్‌కే మ స్తాన్‌బాషా పాల్గొన్నారు.


గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని రప్పించాలి

గల్ఫ్‌ దేశాలకు జీవనాధారం కోసం వెళ్లి కరోనా కాలంలో ఇబ్బందులు పడుతున్న వారిని సొంత గ్రామాలకు రప్పించడానికి కేంద్ర హోమంత్రి అమిత్‌షా, సహాయ మంత్రి కిషన్‌రెడ్డిలు కృషి చేయాలని సీపీఎంజిల్లా కమిటీ సభ్యుడు రామాంజులు పేర్కొన్నా రు. ఆదివారం పార్టీ జిల్లా కమిటీ పిలుపు మే రకు పట్టణంలో బాధితులతో కలిసి సీపీఎం నాయకులు నిరసన తెలిపారు. ఆర్‌ఎన్‌ సాయి, శ్రీధర్‌, వంశీ, లోక్‌నాధ్‌, మధు పాల్గొన్నారు.  

Updated Date - 2020-06-01T09:11:21+05:30 IST