Abn logo
Sep 25 2021 @ 12:21PM

ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పేందుకు కార్మిక లోకం సిద్ధం: రాఘవులు

సంగారెడ్డి: కార్మికుల హక్కుల చట్టాలను అనిచివేస్తున్న ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పేందుకు కార్మిక లోకం సిద్ధమైందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి వి రాఘవులు అన్నారు. శనివారం జిల్లాలోని అశోక్ నగర్, రామచంద్రాపురం, పఠాన్ చేరు మీదుగా నడుస్తున్న సీఐటీయూ కార్మిక గర్జన పాదయాత్రలో రాఘవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర ముగింపు లోగా ప్రభుత్వ తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున కార్మిక లోకం ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు. కార్మికులను బానిసలుగా చూస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాఘవులు డిమాండ్ చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption