Abn logo
Sep 11 2021 @ 11:08AM

బీజేపీ ఒత్తిడికి తెలంగాణ సీఎం లొంగిపోయాడని ఆరోపణ: తమ్మినేని

హైదరాబాద్:  బీజేపీ విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరంలేదంటోన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీజేపీ ఒత్తిడికి తెలంగాణ సీఎం లొంగిపోయాడని ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. బీజేపీతో ఉన్న సమన్వయం కారణంగానే విభజన హామీలను కేసీఆర్ గాలికి‌ వదిలేశారని విమర్శించారు. జీఎస్టీ బకాయిలు, విద్యుత్ చట్టాలు, రైతు చట్టాల్లో కేసీఆర్ పూర్తిగా బీజేపీకి సహరిస్తున్నారన్నారు. మోదీ, కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా జరుగుతోన్న భారత్ బంద్‌లో అందరూ పాల్గొనాలని తమ్మినేని పిలుపునిచ్చారు. 

హైదరాబాద్మరిన్ని...