Abn logo
Oct 23 2021 @ 22:02PM

ఓటర్ల జాబితా అవకతవకలను చూపుతున్న నేతలు

మాదాల వెంకటేశ్వర్లు, నగర కార్యదర్శి మూలం రమేష్‌

ఓటర్ల జాబితాలో అవకతవకలు సరిచేయాలి

సీపీఎం నేతలు మాదాల, మూలం

నెల్లూరు(వైద్యం), అక్టోబరు 23: ఓటర్ల జాబితాలో అవకతవకలు సరిచేసి కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహించాలని మాజీ డిఫ్యూటీ మేయర్‌ మాదాల వెంకటేశ్వర్లు, నగర కార్యదర్శి మూలం రమేష్‌ తెలిపారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో  మాట్లాడారు. నెల్లూరు రూరల్‌ పరిధిలోని 25 డివిజన్‌లో 350 ఓట్లు నెల్లూరు సిటీ పరిధిలోని 54 డివిజన్‌ వెంకటేశ్వరపురంలో చేర్చారన్నారు. ఓకే డోర్‌ నెంబర్‌లో వందల సంఖ్యలో ఓట్లు ఉన్నాయని చెప్పారు. ప్రతి డివిజన్‌లో హద్దులు నిర్ణయించి దాని ప్రకారం డోర్‌ నెంబర్‌ వరుస క్రమంలో మాస్టర్‌ రోల్స్‌ ప్రకారం ఓటర్లు జాబితా తయారు చేయాలని కోరారు. తాజా ఎన్నిలకు జాబితా ప్రకారం ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. రాజకీయ పార్టీల సమావేశంలో కమిషనర్‌ సమాధానం ఇవ్వకుండా దాట వేశారన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్‌ కత్తి శ్రీనివాసులు, మస్తాన్‌బీ తదితరులు పాల్గొన్నారు.