సీపీఎం మండల మహాసభ

ABN , First Publish Date - 2021-09-19T04:30:58+05:30 IST

మండలంలోని నరుకూరు సెంటర్లోని ఆటో స్టాండ్‌ ప్రాంగణంలో శనివారం సీపీఎం మండల రెండో మహాసభ జరిగింది.

సీపీఎం మండల మహాసభ
జెండా ఆవిష్కరిస్తున్న కాల్తిరెడ్డి రమణమ్మ

తోటపల్లిగూడూరు, సెప్టెంబరు 18 :  మండలంలోని నరుకూరు సెంటర్లోని ఆటో స్టాండ్‌ ప్రాంగణంలో శనివారం సీపీఎం మండల రెండో మహాసభ జరిగింది. ఈ సందర్భంగా సభా ప్రాంగణం ఎరుపు మయమైంది.  మహాసభ ప్రారంభానికి ముందు కాల్తిరెడ్డి రమణమ్మ సీపీఎం జెండాను ఆవిష్కరించారు. అనంతరం జక్కా వెంకయ్య చిత్ర పటానికి సీపీఎం జిల్లా నాయకులు పొట్టేపాలెం చంద్రమౌళి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అమరవీరులకు నివాళులు అర్పించారు. మహాసభకు కాకుటూరు సుబ్రహ్మణ్యంరెడ్డి, కాల్తిరెడ్డి రమణమ్మ అధ్యక్షత వహించారు. వేగూరు వెంకయ్య కార్యదర్శి నివేదికను ప్రవేశ పెట్టారు. సీపీఎం జిల్లా  కార్యదర్శి చండ్రా రాజగోపాల్‌ ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. ఢిల్లీ రైతుల పోరాటానికి సంఘీభావంగా ఈనెల 27న జరిగే భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సీపీఎం మండల నూతన కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సీపీఎం మండల కార్యదర్శిగా వేగూరు వెంకయ్య, సభ్యులుగా  కాల్తిరెడ్డి రమణమ్మ, పావురాయల మధు, పచ్చ మధు, బండి శౌరి, గోళ్ల రవి, మారుబోయిన రాజా, నెల్లూరు మస్తానయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated Date - 2021-09-19T04:30:58+05:30 IST