ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2021-05-06T05:36:42+05:30 IST

కొవిడ్‌ బారిన పడిన వారి కోసం స్థానిక బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలోని గుఱ్ఱం జాషువా విజ్ఞానకేంద్రంలో ఐసోలేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు
మాట్లాడుతున్న ఐఏంఏ రాష్ట్ర కార్యదర్శి జి.నందకిషోర్‌, పాల్గొన్న సీపీఎం నాయకులు

గుంటూరు(తూర్పు), మే 5: కొవిడ్‌ బారిన పడిన వారి కోసం స్థానిక బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలోని గుఱ్ఱం జాషువా విజ్ఞానకేంద్రంలో ఐసోలేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి నందకిషోర్‌, ప్రముఖ సర్జన్‌ త్రిపురనేని గోపిచంద్‌, ఐఏంఏ నాయకులు తాతా సేవకుమార్‌ బుధవారం ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకే కుటుంబంలో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చి అదే ఇంట్లో ఉండటానికి ఇబ్బందిపడే వారు, ఇతర పేద, మధ్యతరగతి ప్రజలు ఈ ఐసోలేషన్‌ సెంటర్‌ను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం తూర్పుజిల్లా కార్యదర్శి పాశం రామారావు,  భావన్నారాయణ, ఎల్‌ఎస్‌ భారవి, ఎన్‌.వెంకటేశ్వర్లు, ఈమని ఆప్పారావు, నళినీకాంత్‌, పీఎన్‌ శేఖరరెడ్డి, చిష్ట్టీ, వేణుగోపాలరావు, సలీం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-06T05:36:42+05:30 IST