సీపీఎం సేవలకు సలామ్‌

ABN , First Publish Date - 2021-05-10T05:56:08+05:30 IST

కొవిడ్‌ విలయతాండవం చేస్తోంది. వేలాది మంది ప్రజలు వైరస్‌ బారిన పడి విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క బాధితులు అవస్థలు పడుతున్నారు. అనేక మంది భయంతో.. మరోవైపు సకాలంలో వైద్య సేవలు అందక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

సీపీఎం సేవలకు సలామ్‌

కొవిడ్‌ బాధితులకు ప్రత్యేక క్వారంటైన

దాతలిచ్చిన నిధులతో నిర్వహణ

ఉచిత వసతి, భోజనం, చికిత్స

తొలుత 25 బెడ్ల ఏర్పాటు..

తాజాగా 50కి పెంపు

ఆనందం వ్యక్తం చేస్తున్న కరోనా బాధితులు

అనంతపురం వైద్యం, మే9: కొవిడ్‌ విలయతాండవం చేస్తోంది. వేలాది మంది ప్రజలు వైరస్‌ బారిన పడి విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క బాధితులు అవస్థలు పడుతున్నారు. అనేక మంది భయంతో.. మరోవైపు సకాలంలో వైద్య సేవలు అందక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం కొవిడ్‌ బాధితులకు తమ వంతు చేయూతనందించి వారి ప్రాణాలు కాపాడేందుకు ముందుకొచ్చింది. జిల్లా కేంద్రంలోని ఇందిరా నగర్‌లోని హెచఎల్‌సీ కాలనీ సమీపంలో ఉన్న వీకే భవన వద్ద ప్రత్యేక క్వారంటైన కేంద్రం ఏర్పాటు చేశారు. కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న ఈ క్వారంటైనను 25 పడకలతో ఏర్పాటు చేశారు. దీంతో కరోనా పాజిటివ్‌ బాధితులు ఇళ్లలో ఉండడానికి భయపడుతూ, ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన అందక పడుతున్న బాధలు చూసి, చలించిపోయి సీపీఎం ఏర్పాటు చే సిన క్వారంటైనకు వెళ్లి, చికిత్సలు పొందుతున్నారు. ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, జర్నలిస్టులతోపాటు వారి కు టుంబ సభ్యులు, సామాన్య ప్రజలు ఈ క్వారంటైనలో చేరి, చికిత్సలు పొందుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 30 మంది కరోనా పాజిటివ్‌ బాధితులు చేరి, చికిత్స పొం దుతూ వస్తున్నారు. వీరిలో ఏడుగురు కోలుకుని, డి శ్చార్జ్‌ అయి ఇంటికెళ్లారు. రోజూ ఈ క్వారంటైనకు బాధితుల తా కిడి పెరగడంతో అదనంగా మరో 25 పడకలను ఆదివారం ఏర్పాటు చేశారు.


ఉచిత వసతి, భోజనం, వైద్యం

సీపీఎం ఏర్పాటు చేసిన క్వారంటైనలో చేరిన బాధితులకు ఉచిత వసతి, భోజనం, వైద్య సేవలు అందిస్తున్నారు. ఉదయం 7 గంటలకు రాగిమాల్ట్‌, 8 గంటలకు టిఫిన, 11 గంటలకు టీ, బిస్కెట్‌, మధ్యాహ్నం ఒంటి గంటకు చికెన గానీ, కోడిగుడ్డు కర్రీతో అన్నం, 4 గంటలకు స్నాక్స్‌, రాత్రికి రెండు చపాతీలు, అన్నం, పప్పు, మజ్జిగ బాధితులకు అందిస్తున్నారు. ముగ్గురు నర్సులు, ఒక మెడికల్‌ స్టూడెంట్‌ నిరంతరం క్వారంటైనలో ఉంటూ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితులను జూనియర్‌ డాక్టర్‌ దిలీ్‌పరెడ్డి ఉదయం, సాయంత్రం వచ్చి పరిశీలిస్తున్నారు. ఐదుగురు సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ గేయానంద్‌, డాక్టర్‌ ప్రసూన, డాక్టర్‌ కొండయ్య, డాక్టర్‌ వీరభద్రయ్య, డాక్టర్‌ దుర్గేష్‌ బాధితులు అవసరమైన వైద్య సేవలు అందించేలా సలహాలు ఇస్తున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితులు ఈ ఐదుగురు సీనియర్‌ వైద్యుల దృష్టికి నర్సులు తీసుకెళితే వారికి ఏ చికిత్స అందించాలో వారు సూచించి, వైద్య సేవలు అందేలా చేస్తున్నారు. ఇలా సీపీఎం క్వారంటైనలో కొవిడ్‌ బాధితుల కు మంచి భోజనం, నాణ్యమైన వైద్య సేవలు, మం దులు ఉచితంగా అందించి, వారి ఆరోగ్యాన్ని రక్షిస్తూ భరోసా కల్పిస్తున్నారు. 


భరోసా కల్పించి, ప్రాణం పోస్తున్నారు

పాజిటివ్‌ వచ్చిందని తెలియగానే ఎంతో ఆందోళన చెందాం. ఆస్పత్రుల్లో పరిస్థితులు చూసి, అక్కడ చేరుతామా అనే భయం ఏర్పడింది. ఈ సమయంలో సీపీఎం క్వారంటైన మాకు భరోసా కల్పించి, ప్రాణం పోస్తోంది. వారి సేవలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. వారికి రుణపడి ఉంటాం.                             

    - శ్రీనివా్‌సరెడ్డి, మల్లీశ్వరి, మురళి


పెద్ద పార్టీలు, పెద్దోళ్లు ముందుకు రావాలి

మానవత్వంతోపాటు ప్రజలను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కరోనా బాధితులకు బెడ్లు దొరక్క అవస్థలు పడుతుండడం చూసి బాధపడ్డాం. మా వంతు సాయం చేయాలని దాతల సహకారంతో క్వారంటైన ఏర్పాటు చేశాం. పెద్ద పార్టీలు, పెద్దపెద్ద వాళ్లు ఎం దరో ఉన్నారు. మండలానికొకటి ఇలాంటి క్వారంటైన ఏర్పాటు చేసి, బాధితులకు వసతి, వైద్య సేవలు అందిస్తే ఎంతో మంది ధై ర్యంగా పాజిటివ్‌ వచ్చినా బతుకుతారు. ఎన్నికల్లో రూ.లక్షలు ఖర్చు పెడుతుంటారు. ఇలాంటి సమయంలో ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.           -

     రాంభూపాల్‌, సీపీఎం జిల్లా ఉత్తర ప్రాంత కార్యదర్శి


Updated Date - 2021-05-10T05:56:08+05:30 IST