సీ.పీ.ఎస్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-05-27T06:05:08+05:30 IST

ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ రెగ్యులర్ సిబ్బందికి సీ.పీ.ఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) విధానం అమలు చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్.ఎం.ఎస్.ఏ- మోడల్ స్కూల్స్ రాష్ట్ర స్వయంప్రతిపత్తి...

సీ.పీ.ఎస్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి

ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ రెగ్యులర్ సిబ్బందికి సీ.పీ.ఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) విధానం అమలు చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్.ఎం.ఎస్.ఏ- మోడల్ స్కూల్స్ రాష్ట్ర స్వయంప్రతిపత్తి సంస్థగా రిజిస్టర్ చేయబడిన సంస్థ అని తెలుపుతూ 2014–-15లో విద్యాశాఖ ఈ సిబ్బందికి సీ.పీ.ఎస్ విధానం అమలు కొరకు పీ.ఎఫ్.ఆర్.డీ.ఏ, ఎన్.ఎస్.డీ.ఎల్‌‍తో సంప్రదింపులు జరిపింది. సిబ్బంది పోరాటాల వలన 2018లో ప్రాన్ కార్డ్స్ వచ్చినా, సీ.పీ.ఎస్ కొరకు జీతం నుండి మినహాయింపులు జరపాలని తగు ఉత్తర్వులు ఉన్నా పెన్షన్ స్కీమ్ అమలు కావడం లేదు.


కేవలం 200 రూపాయల ప్రొఫెషనల్ టాక్స్ తప్ప వీరి శాలరీ నుండి ఏ విధమైన ఇతర మినహాయింపులు సమగ్ర ఆర్థిక నిర్వహణ పద్ధతి ద్వారా జరగడం లేదు. 2015లో రాష్ట్రాలకు మోడల్ స్కూల్స్‌ను బదిలీ చేయడం వలన మోడల్ స్కూల్స్ రెగ్యులర్ సిబ్బందికి ప్రతి చిన్న అంశం గుర్తింపు సమస్యగా మారింది. దేశం మొత్తం నూతన పెన్షన్ స్కీమ్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంటే ఈ మోడల్ స్కూల్స్ సిబ్బంది మాత్రం సీ.పీ.ఎస్ అమలుకోసం ఎందుకు పోరాడుతున్నారు అనేది ఇక్కడ ప్రధాన అంశం. మోడల్ స్కూళ్ల ప్రాజెక్టులో రెగ్యులర్ సిబ్బందికి సీ.పీ.ఎస్ అమలుకు ఏడు సంవత్సరాల సమయం తీసుకున్నా ఇంకా ఈ సమస్య ప్రభుత్వ పరిశీలనలో ఉంది అంటూ మోడల్ స్కూళ్ల విభాగం అధికారులు చెబతున్నారు. ఈ సమస్యకు ఇప్పటికైనా పరిష్కారం చూపాలని సిబ్బంది కోరుతున్నారు.

బి. సురేశ్

అరసవల్లి, శ్రీకాకుళం జిల్లా

Updated Date - 2020-05-27T06:05:08+05:30 IST