పాత పెన్షన్‌ విఽధానాన్ని అమలుచేయాలి: శంకర్‌

ABN , First Publish Date - 2020-02-28T11:40:26+05:30 IST

సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానా న్ని ఉద్యోగులకు వర్తింప చేయాలని జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు బొంకూరి శంక ర్‌ అన్నారు. గురువారం డిమాండ్స్‌ డే సందర్భంగా మధ్యాహ్నం భోజన

పాత పెన్షన్‌ విఽధానాన్ని అమలుచేయాలి: శంకర్‌

పెద్దపల్లి టౌన్‌, ఫిబ్రవరి 27: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానా న్ని ఉద్యోగులకు వర్తింప చేయాలని జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు బొంకూరి శంక ర్‌ అన్నారు. గురువారం డిమాండ్స్‌ డే సందర్భంగా మధ్యాహ్నం భోజన వేళలో స్థానిక కలెక్టరేట్‌ ఎదుట టీఎన్జీవో సంఘం నాయకులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ తమ డిమాం డ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని, ప్రభుత్వంలోని కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరించాలని కోరారు. 2018 జూలై నుంచి తమకు పీఆర్సీ అమలు చేయాలని కోరారు. ప్రజలకు సేవ చేసే రాజకీయ నాయకులకు పెన్షన్‌ లభిస్తుందని, 30 ఏళ్లు పని చేసే ఉద్యో గులను ప్రభుత్వం విస్మరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీఓ సెక్రటరీ రాజనరేందర్‌, జిల్లా సహ అధ్యక్షుడు భిక్షపతి, జిల్లా కోశాధికారి శ్రీనివాస్‌, పబ్లిసిటీ సెక్రటరీ శ్రీధర్‌, జిల్లా టీఎన్జీఓలు, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ రవీందర్‌, కలెక్టరేట్‌ సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-28T11:40:26+05:30 IST