సీపీఎస్‌ రద్దు చే యాలి

ABN , First Publish Date - 2021-12-08T04:38:53+05:30 IST

రాష్ట్ర జేఏసీ, అమరావతి జేఏసీ పిలుపు మేరకు ప్రభుత్వ ఉద్యోగులు వివిధ డిమాండ్ల సాధన కోసం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

సీపీఎస్‌ రద్దు చే యాలి
గిద్దలూరులో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న విశ్రాంత ఉద్యోగులు

మాట తప్పిన జగన్‌

ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు

నల్ల బ్యాడ్జీలతో నిరసన

గిద్దలూరు, డిసెంబరు 7 : రాష్ట్ర  జేఏసీ, అమరావతి జేఏసీ పిలుపు మేరకు ప్రభుత్వ ఉద్యోగులు వివిధ డిమాండ్ల సాధన కోసం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. శాఖలవారీగా ఉద్యోగులు తాము పని చేసే కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఉద్యోగుల ఆందోళనకు రిటైర్డ్‌ ఉద్యోగులు సైతం మద్దతు తెలిపారు. ఎన్జీవో సంఘ అధ్యక్షుడు నరేష్‌బాబు మాట్లాడుతూ సీపీ ఎస్‌ను వెంటనే రద్దు చేసి, పీఆర్సీని ప్రకటించాలని డి మాండ్‌ చేశారు.  కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చే యాలని, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలను పెంచాలని కోరారు.  కార్యక్రమంలో ఉద్యోగ, రిటైర్డ్‌ ఉద్యోగ సంఘం ప్రతినిధులు రవీంద్రనాథరెడ్డి, కుద్దూస్‌, వెంకటేశ్వర్లు, రిటైర్డ్‌ డిప్యూటీ డీఈవో కాశీశ్వరరావు, విశ్రాంత ఎంఈవో కాశిరంగారెడ్డి  పాల్గొన్నారు.

నిరసనలను విజయవంతం చేయాలి

మార్కాపురం  : ఏపీజేఏసీ ఆధ్వర్యంలో చేయబోయే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఏపీ జేఏసీ మార్కాపురం తాలూకా చైర్మన్‌ బీవీ శ్రీనివాసశాస్త్రి అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో, ఆర్డీవో కార్యాలయంలో సిబ్బందితో మంగళవారం ఆయన సమా వేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి 72 ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచిందన్నారు. ప్రతిపక్షనేతగా పాద యాత్రలో ఇచ్చిన హామీలైన సీపీఎస్‌ రద్దును వెంటనే అమలు చేయాలన్నారు ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగు ల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. మండలం లోని తిప్పాయపాలెం ప్రాథమిక వైద్యశాలలో ఏపీ ఎన్జీ వో సంఘం నాయకులు నాగేంద్రరెడ్డి ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య సిబ్బంది నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్య క్రమంలో ఎస్టీయూ నాయకులు ఎర్రయ్య, రామాంజనే యులు, ఆర్డీవో కార్యాలయ సిబ్బంది నెహ్రూబాబు, సు బ్బారావు, హర్ష, పర్విన్‌, సాలమ్మ, అటవీశాఖ సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలి

ఎర్రగొండపాలెం : పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపులు వెం టనే చేయాలని  ఏపీ ఎన్జీవో ఎర్ర గొండపాలెం తా లుకా అ సోసియేషన్‌ నాయకులు, రెవె న్యూ ఉద్యోగులు మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎ దుట నల్లబ్యాడ్జీలతో నిరసన తె లిపారు. తాలూకా ఎన్జీవో అధ్య క్షుడు టి.సుబ్బారావు మాట్లాడుతూ  వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా పీఆర్సీ అ మలుపై తీవ్ర జాప్యాన్ని ప్రద ర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చే శారు. సీఎం కాగానే సీపీఎస్‌ రద్దు చేస్తానని చెప్పిన జగన్‌ మాటతప్పారన్నారు.  3 రోజుల పాటు నిరసనలు తెలుపుతామన్నారు.  ఈ సంద ర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన తెలిపా రు. ఎన్జీవో కార్యదర్శి చేదూరి రవికుమార్‌, ఆర్‌ఐ షేక్‌ ఫి రోజ్‌, మండల వీఆర్వోల సంఘ ప్రధాన కార్యదర్శి  జీ ఎల్‌ లక్ష్మీప్రసాద్‌, ఎన్జీవో ఉపాధ్యక్షుడు శివారెడ్డి, వీఆర్వోలు విష్ణు,  వీఆర్‌ఏలు పాల్గొన్నారు. 

వైసీపీ వైఖరిపై ఆందోళన

త్రిపురాంతకం :  ఉద్యోగులకు  జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ సీపీఎస్‌ రద్దుతో పాటు పీఆర్సీ అమలు, డీఏల బకాయిపై  అనుసరిస్తున్న వైఖరిపై సచివాలయ ఉద్యోగులు తప్పుబట్టారు. నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమాన్ని జి.ఉమ్మడివరం గ్రామ సచివాలయం వద్ద మంగళవారం చేపట్టారు. తక్షణమే  స్పందించి ఉద్యోగులకు మేలు చేయాలని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి వెంకటరావు, సచివాలయ సి బ్బంది పాల్గొన్నారు.




Updated Date - 2021-12-08T04:38:53+05:30 IST