సీపీఎస్ రద్దు తధ్యం : అందుకే ఉద్యమ పథం

ABN , First Publish Date - 2022-01-17T01:58:18+05:30 IST

భాగస్వామ్య పింఛను పథకం రద్దు, పాత పింఛను సాధన కోసం నిర్విరామ పోరాటమే శరణ్యమని తెలంగాణ రాష్ట్ర భాగస్వామ్య పింఛను పథకం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం (సీ పీ ఎస్ టీ ఈ ఏ టీ ఎస్) స్పష్ట సేసింది.

సీపీఎస్ రద్దు తధ్యం : అందుకే ఉద్యమ పథం

హైదరాబాద్: భాగస్వామ్య పింఛను పథకం రద్దు, పాత పింఛను సాధన కోసం నిర్విరామ పోరాటమే శరణ్యమని తెలంగాణ రాష్ట్ర భాగస్వామ్య పింఛను పథకం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం (సీ పీ ఎస్ టీ ఈ ఏ టీ ఎస్) స్పష్ట సేసింది.సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో సంఘం కార్య వర్గ సమావేశం జరిగింది.


ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు దాముక కమలాకర్ మాట్లాడుతూ 1.9.2004 లో అమలైన కాంట్రి బ్యుటరీ పెన్షన్ స్కీమ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఒకే పని చేసే వ్యక్తులకు రెండు రకాల పింఛను ఇవ్వడం విడ్డూరం అన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీటి భూపతి రావు. ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్, గణపురం సురదీర్, ఈ వీ ఎన్ రెడ్డి, పుల్లారావు, తదితర సీ పీ ఎస్ నాయకులు పాల్గోన్నారు.

Updated Date - 2022-01-17T01:58:18+05:30 IST