క్రేజ్ పెరుగుతోంది.. ధర తగ్గుతోంది

ABN , First Publish Date - 2021-10-16T00:22:08+05:30 IST

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో విద్యుత్తు వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. వినియోగదారులు విపరీతంగా క్రేజ్ చూపించడం కూడా ఈవీ తయారీ కంపెనీలకు కలిసొస్తోంది.

క్రేజ్ పెరుగుతోంది..  ధర తగ్గుతోంది

హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో విద్యుత్తు వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. వినియోగదారులు విపరీతంగా క్రేజ్ చూపించడం కూడా ఈవీ తయారీ కంపెనీలకు  కలిసొస్తోంది. ఈ క్రమంలో... వినియోగదారులకు అందుబాటు రేంజ్‌లో తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వెహికిల్‌ను అందించేందుకు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. తాజాగా ఆంపియర్ ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మాగ్నస్ ఎక్స్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది. దీని ధర కేవలం రూ. 68,999(ఎక్స్ షోరూమ్, పూణే) మాత్రమే. ఇక ఈ కొత్త మాగ్నస్ ఎక్స్ స్కూటర్‌ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే చాలు... 121 కిలోమీటర్లు(ఏఆర్ఏఐ పరీక్షించింది) వరకూ వెళ్ళగలదు. ఈ కొత్త మాగ్నస్ ఎక్స్ ఈ-స్కూటర్‌లో తేలికైన పోర్టబుల్ అధునాతన లిథియం బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని 5-యాంప్ సాకెట్ ద్వారా సులభంగా ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంది.  ఇందులో 1200 వాట్స్ మోటార్ ఉంది. ఈ మోటార్ ఇంజిన్ 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం పది సెకండ్లలోనే అందుకుంటుంది. 

Updated Date - 2021-10-16T00:22:08+05:30 IST