మహేశ్ బాబు - త్రివిక్రమ్ మూవీపై క్రేజీ రూమర్

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మహేశ్ .. త్రివిక్రమ్ దర్శకత్వంలోని మూవీని మొదలు పెట్టబోతున్నారు.  నిజానికి ఈ మూవీ షూటింగ్ కు మరింత టైమ్ పడుతుందని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచే చిత్రీకరణ ప్రారంభం కానున్నట్టు తాజా సమాచారం. అంతేకాదు.. ఓ సాంగ్ షూట్ తో ఫస్ట్ షెడ్యూల్ ను మొదలుపెడతారట. మరో విశేషమేంటంటే.. ఈ సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తారట. 


‘అతడు, ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో రానున్న ఈ మూడో చిత్రానికి భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు పదకొండేళ్ళ తర్వాత  వీరి కలయికలో మరో సినిమా రానుండడం విశేషం. ‘మహర్షి, సరిలేరు నీకెవ్వరు’ సూపర్ హిట్  చిత్రాల తర్వాత మహేశ్, ‘అరవింద సమేత, అల వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్స్ తర్వాత  త్రివిక్రమ్ చేయబోతున్న ఈ సినిమా.. ఇంకే రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. 

Advertisement
Advertisement