క్రెడిట్ కావాలా.. అని కాల్ చేసిన ఓ యువతికి...

ABN , First Publish Date - 2021-03-26T18:59:05+05:30 IST

కాల్‌ సెంటర్‌ నుంచి లోన్‌, క్రెడిట్‌ కార్డు కావాలా అంటూ ఓ యువతి

క్రెడిట్ కావాలా.. అని కాల్ చేసిన ఓ యువతికి...

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : కాల్‌సెంటర్‌ నుంచి ఫొన్‌ చేసిన యువతని వేధించిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాతబస్తీ ఛత్రినాకకు చెందిన చంద్రవేద్‌కు కాల్‌ సెంటర్‌ నుంచి లోన్‌, క్రెడిట్‌ కార్డు కావాలా అంటూ ఓ యువతి ఫోన్‌ చేసింది. ఆ నంబర్‌ను సేవ్‌ చేసుకున్న చంద్రవేద్‌ తర్వాత ఆమెకు ఫోన్‌ చేసి వేధించసాగాడు. ఆమె అతడి నంబర్‌ను బ్లాక్‌ చేయగా, వాట్సాప్‌ కాల్స్‌ చేసి అలాగే ప్రవర్తించేవాడు. అది కూడా బ్లాక్‌ చేసింది. వేరే నెంబర్‌ నుంచి ఏకంగా వీడియా కాల్‌ చేశాడు. న్యూడ్‌గా కాల్‌ చేయడంతో యువతి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  

Updated Date - 2021-03-26T18:59:05+05:30 IST