ముగిసిన క్రికెట్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-01-24T04:13:19+05:30 IST

సంకాంత్రి సందర్బంగా మండలంలోని రాజుపాలెంలో గ్రామ యువత ఆధ్వర్యంలో గత 10 రోజులుగా నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి క్రికెట్‌ పోటీలు ఆదివారంతో ముగిశాయి.

ముగిసిన క్రికెట్‌ పోటీలు


త్రిపురాంతకం, జనవరి 23 : సంకాంత్రి సందర్బంగా మండలంలోని రాజుపాలెంలో గ్రామ యువత ఆధ్వర్యంలో గత 10 రోజులుగా నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి క్రికెట్‌ పోటీలు ఆదివారంతో ముగిశాయి.  ఈ సందర్భంగా నిర్వహించిన ఫైనల్‌ పోటీలలో రాజుపాలెం జట్టుపై వైపాలెం బాబు జట్టు గెలుపొంది ప్రథమ బహుమతి సాధించింది. రెండవ బహుమతి రాజుపాలెం, మూడో బహుమతి సోమేపల్లి జట్లు సాధించాయి. అనంతరం విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. 


Updated Date - 2022-01-24T04:13:19+05:30 IST