నీతో కలిసి ఓపెనింగ్ చేయడం సరదాగా ఉంటుంది: సచిన్

ABN , First Publish Date - 2020-08-04T20:51:17+05:30 IST

ఐపీఎల్‌లోని నెంబర్‌వన్ జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇప్పటికే అత్యధిక టైటిళ్లను కైవసం చేసుకుంది. దీంతో రోహిత్‌కు..

నీతో కలిసి ఓపెనింగ్ చేయడం సరదాగా ఉంటుంది: సచిన్

ముంబై: ఐపీఎల్‌లోని నెంబర్‌వన్ జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇప్పటికే అత్యధిక టైటిళ్లను కైవసం చేసుకుంది. దీంతో రోహిత్‌కు కూడా ఐపీఎల్‌లోనే బెస్ట్ కెప్టెన్‌గా పేరొచ్చింది. ఇదిలా ఉంటే ఇటీవల ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా రోహిత్ తన ట్విటర్ ఖాతాలో లైవ్ సెషన్‌ను నిర్వహించాడు. అభిమానులు అడిగే ప్రశ్నలకు వీడియో సందేశాల ద్వారా సమాధానాలిచ్చాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని, ముంబయి జట్టులోకి ఎవరైనా ఇద్దరు సీనియర్ ఆటగాళ్లను తీసుకోవాలంటే ఎవరిని తీసుకుంటావని అడిగాడు. దీనికి సమాధానంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, సౌత్‌ఆఫ్రికా ఆల్‌రౌండర్ షాన్ పొల్లాక్‌లను తీసుకోవడానికి ఇష్టపడతానని రోహిత్ చెప్పాడు. ఇద్దరూ క్రికెట్‌లో లెజెండ్స్ అని, అలాంటి వారు తన జట్టులో ఉండటం ఎంతో గొప్పగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. రోహిత్ ట్వీట్‌ను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ నేపథ్యంలో రోహిత్ కామెంట్‌పై సచిన్, పొల్లాక్‌లు స్పందించారు. ‘ రోహిత్.. నీతో కలిసి ఓపెనింగ్ చేయడం ఎంతో సరదాగా ఉంటుంది’ అని సచిన్ రిప్లై ఇవ్వగా, ‘ ఓకవేళ అది సాధ్యం అయితే మళ్లీ నెట్స్‌కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తా’నని షాన్ పొల్లాక్ పేర్కొన్నాడు.





Updated Date - 2020-08-04T20:51:17+05:30 IST